(Local) Tue, 27 Oct, 2020

సూరత్ మార్కెట్లోకి ట్రాన్స్‌జెండర్ల రాకపై నిషేధం

September 28, 2019,   9:42 AM IST
Share on:
సూరత్ మార్కెట్లోకి ట్రాన్స్‌జెండర్ల రాకపై నిషేధం

ఇటీవల గుజరాత్‌లోని సూరత్ మార్కెట్లో ఓ వ్యక్తిని ట్రాన్స్‌జెండర్లు కర్రతో కొట్టి చంపిన నేపథ్యంలో సూరత్ మార్కెట్లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం విధించారు. ట్రాన్స్‌జెండర్లు వ్యక్తిని చంపడం దారుణమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గుణపాఠం చెప్పాలంటే నిషేధం విధించాల్సిందేనని సూరత్‌లోని జపాన్ మార్కెట్ ప్రెసిడెంట్ లలిత్ శర్మ పేర్కొన్నారు. మార్కెట్లోకి ట్రాన్స్‌జెండర్లు ప్రవేశించరాదంటూ ఇప్పటికే నోటీసులు కూడా అంటించారు. అయితే తమకు ఆ ఘటనతో సంబంధం లేదనీ, ఎవరో చేసిన నేరానికి తమను శిక్షించడం భావ్యం కాదని ట్రాన్స్‌జెండర్లు చెబుతున్నారు. ఈ నిషేధంతో పండుగలు, పర్వదినాల సందర్భంగా మార్కెట్ల ద్వారా వచ్చే డబ్బులు రాకుండా పొతే తాము బతకడం కష్టమవుతుందని, కాబట్టి తమపై నిషేధం విధించడం భావ్యం కాదని పాయల్ కౌర్ పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.