(Local) Tue, 02 Mar, 2021

తెలంగాణ లో పలువురు ఐ ఎ ఎస్ లు బదిలీ

August 19, 2019,   1:15 PM IST
Share on:
తెలంగాణ లో పలువురు ఐ ఎ ఎస్ లు బదిలీ

తెలంగాణలో పలువురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రాజేశ్వర్ తివారిని అటవీ పర్యావరణ శాఖ స్పెషల్ సీఎస్ గా బదిలీ చేశారు. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సోమేష్ కుమార్ ను నియమించారు. సీసీఎల్ ఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలతో పాటు రేరా చైర్మన్ గా నియమించారు.  పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గా ఉన్న నీతూకుమారి ప్రసాద్ స్థానంలో రఘునందన్ రావు ను నియమించారు. నీతూ కుమారికి ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. మరి కొంత మంది ఐఏఎస్ ల బదిలీలు కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత వర్గం
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.