(Local) Sun, 20 Jun, 2021

పండుగ పూట దువ్వాడలో ఆగిన పలు రైళ్లు

October 08, 2019,   11:16 AM IST
Share on:
పండుగ పూట దువ్వాడలో ఆగిన పలు రైళ్లు

విశాఖపట్నం జిల్లా కశింకోట సమీపంలో రైలు పట్టాలు విరగడంతో, విజయవాడ - విశాఖ మధ్య నడిచే పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కశింకోట సమీపంలో ఘటన చోటుచేసుకుంది. దీంతో పండుగ రోజు పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పట్టాలను సరిచేసే పనిలో పడ్డారు. దువ్వాడలో జన్మభూమి, సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. వీటితో పాటు దూరప్రాంతాల నుంచి వచ్చే పలు రైళ్లు గంట నుంచి రెండు గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి. మధ్యాహ్నానికి మొత్తం సమస్య సర్దుకుంటుందని అధికారులు వెల్లడించారు. పండుగ పూట ఉరికి బయల్దేరిన ప్రయాణికులు ఇప్పటికే ఆలస్యం అయిందని వాపోతున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.