(Local) Mon, 09 Dec, 2019

పాక్‌లో కిలో టమాటా @.300

November 14, 2019,   1:31 PM IST
Share on:
పాక్‌లో కిలో టమాటా @.300

పాకిస్థాన్ లో మండిపోయే కూరగాయల ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతినడం, భారతదేశం నుంచి దిగుమతుల్ని నిలిపివేయడంతో పాకిస్థాన్‌లో టమాటా ధర కిలో రూ.180 నుంచి రూ.300 వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్థాన్ భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కశ్మీరీలకు సంఘీభావం ప్రకటిస్తూ భారత్‌తో వాణిజ్య బంధాన్ని తెంచుకుంటున్నట్లు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని పాక్ మేధావులే తప్పుబట్టినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. అయితే వారం రోజులు తిరగకముందే ఆ నిర్ణయం ఎంత తప్పో పాకిస్థాన్‌కు తెలిసొస్తోంది.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.