(Local) Mon, 27 Sep, 2021

బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీ అమలుచేసేది లేదు..!

September 21, 2019,   5:29 PM IST
Share on:
బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీ అమలుచేసేది లేదు..!

పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీని అమలు చేస్తామంటూ కొంత మంది బీజేపీ నేతులు గత కొద్దిరోజులుగా వ్యాఖ్యానిస్తుండటంతో బెంగాల్ ప్రజలలో ఒకింత గందరగోళం నెలకొని ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయనిచ్చేది లేదని స్పష్టం చేసారు. బెంగాల్‌ నుంచి ఎవరూ వెళ్లిపోవాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. బెంగాల్ ప్రజలందురూ సవరణ చేసిన ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో పేరు లేకుంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అస్సాంలో ప్రభుత్వం విడుదల చేసిన ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో దాదాపు 19 లక్షల మందికి స్థానం దక్కలేదన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు మమతా బెనర్జీ గుర్తుచేశారు.

సంబంధిత వర్గం
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.