(Local) Sat, 24 Jul, 2021

పేరు మార్చుకున్న ఉగ్ర సంస్థ జైష్ ...ఆత్మాహుతి దాడులకు సిద్ధం

September 24, 2019,   1:35 PM IST
Share on:
పేరు మార్చుకున్న ఉగ్ర సంస్థ  జైష్ ...ఆత్మాహుతి దాడ ...

పాకిస్తాన్‌లో తాము కొనసాగిస్తున్న ఉగ్ర శిక్షణా కార్యకలాపాల నుంచి అంతర్జాతీయ ఒత్తిడిని, డేగ కన్నును తప్పించుకోవడానికి ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ తన పేరును మజ్లిస్ వురాసా-ఎ-షుహుడా జమ్మూ కాశ్మీర్గా మార్చుకుంది. జైష్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ అస్వస్థత కారణంగా కొత్త ఉగ్రవాద సంస్థ నిర్వహణ బాధ్యతలను అతని తమ్ముడు ముఫ్తి అబ్దుల్ రవూఫ్ అస్ఘర్ చేపట్టినట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడిన అజర్ ప్రస్తుతం కదలలేని స్థితిలో పాకిస్తాన్‌లోని భవల్‌పూర్‌లోని మర్కాజ్ ఉస్మాన్ఓఅలీలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఖదామ్ఉల్ఇస్లామ్, అల్ రెహ్మత్ ట్రస్ట్‌గా పిలుచుకున్న జైష్ కొత్త పేరుతో అవతరించినప్పటికీ దాని నాయకత్వం, ఉగ్రవాద మూకలు మాత్రం అందులోనే కొనసాగుతున్నాయి. భారత్‌పై ఇదివరకే జిహాద్ ప్రకటించిన జైష్ తాజాగా జమ్మూ కశ్మీరులోని భారతీయ భద్రతా దళాల వాహనశ్రేణి, మిలిటరీ కంటోన్మెంట్లలోని కట్టడాలపై దాడులకు 30 మందితో కూడిన ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

సంబంధిత వర్గం
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.