(Local) Mon, 23 Sep, 2019

నిజామాబాద్ లో ఉద్రిక్తత : గాంధీ విగ్రహం పై పాకిస్తాన్ జిందాబాద్ రాతలు

August 26, 2019,   11:29 AM IST
Views: 213
Share on:
నిజామాబాద్ లో ఉద్రిక్తత : గాంధీ విగ్రహం పై పాకిస్త ...

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నలుపు రంగు పూశారు. పాకిస్థాన్ జిందాబాద్, ఇండియా డౌన్ డౌన్, పిఎఫ్ఐ నాయకుడు షాదుల్లాను వెంటనే విడుదల చేయాలని నినాదాలు కాగితాలపై రాసి మహాత్ముడి విగ్రహానికి  కట్టారు. శనివారం ఈ ఘటన జరగగా ఆదివారం మధ్యాహ్నం గ్రామస్థులు ఈ విషయాన్ని గుర్తించారు.

వెంటనే రూరల్ పోలీసులకు తెలిపారు.  విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విగ్రహానికి పులిమిన నలుపు రంగును చేరిపివేశారు. ఉగ్రవాదుల వల్ల తమ గ్రామానికి ముప్పు ఉందని గ్రామ సర్పంచ్ లక్ష్మన్ రావు, ఉప సర్పంచ్ శంకర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గంగాధర్ నేతృత్వంలో గ్రామస్థులు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల నిషిద్ధ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ) అనుబంధ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ)కు చెందిన నిజామాబాద్ కు చెందిన షాదుల్లా, జగిత్యాలకు చెందిన సాజిద్ తో పాటు మరొకరిని నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులు వారం క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అలాగే దర్యాప్తులో పిఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు అబ్దుల్ అహ్మద్ ఇదే గుండారం గ్రామంలో షెల్టర్ తీసుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. వారి దర్యాప్తు కొనసాగుతుండగానే ఇలా మహాత్ముడి విగ్రహానికి పిఎఫ్ఐ నాయకుడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నలుపు రంగు పులిమి దేశానికి వ్యతిరేకంగా నినాదాలు రాసి దుశ్చర్యకు పాల్పడడంతో గ్రామంలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
 

సంబంధిత వర్గం
ప్రపంచపటంలో పాకిస్థాన్ ఉండదు: కిషన్ రెడ్డి
ప్రపంచపటంలో పాకిస్థాన్ ఉండదు: కిషన్ రెడ్డి

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.