(Local) Mon, 12 Apr, 2021

మంత్రి ప్రశాంత్ రెడ్డి సభలో ఉద్రిక్తత

October 06, 2019,   12:07 PM IST
Share on:
మంత్రి ప్రశాంత్ రెడ్డి సభలో ఉద్రిక్తత

మంత్రి ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాల్కొండలో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో మంత్రి ఎదుట ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. తన భూ-సమస్యను పరిష్కరించకుండా అధికారులు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రఘువీర్ అనే రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.దీంతో అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు రఘవీర్ ను అడ్డుకుని ఒంటిపై నీళ్లు చల్లారు. అనంతరం కుటుంబ సభ్యులు రైతును ఆసుపత్రికి తరలించారు. తన భూమి వివరాలను ఆన్ లైన్ లో ఎక్కించడం లేదని, ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టు తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని రఘువీర్ ఆవేదన చెందాడు.అయితే తన సమస్యకు మంత్రి సమక్షంలోనే పరిష్కారం కనుక్కోవాలని భావించి రఘువీర్ మంత్రి కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు వస్తారని భావించి ఆ కార్యక్రమంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయంపై స్పందించిన మంత్రి సదరు రైతు కుటుంబ సభ్యులతో మాట్లాడి రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు రఘువీర్ తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.