తెలుగు డైలీ 24 ఎక్సక్లూజివ్ :ఇక సెలవు...నింగికేగిసిన చిన్నమ్మ

సుష్మా స్వరాజ్... ఈ పేరు తెలియని వారుండరు. ఈ పేరు వినగానే ఆమె మాటల తూటాలు గుర్తుకు వస్తాయి. ఏ అంశంపైనైనా అనర్గళంగా మాట్లాడగలిగే శక్తి ఆమెది. మాటలతోనే అందరిని అదరగొట్టే దైర్యం ఆమె సొంతం. ప్రత్యర్ధిని గడగడలాడించగల నేత సుష్మా స్వరాజ్. తెలంగాణ కోసం తన వాణిని వినిపించి తెలంగాణ చిన్నమ్మగా పేరు తెచ్చుకుంది. నుదిటిన నిండైన సింధూరంతో భారతీయ సాంప్రదాయ స్త్రీగా సుష్మా ఉండేవారు. సామాన్యుల కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడిన ఆ గళం నేడు మూగవోయింది. హఠాన్మరణంతో సుష్మా స్వరాజ్ ఇక సెలవంటూ నింగికేగసింది. కోట్లాది మంది ప్రజల హృదయాలు గెలుచుకున్న సుష్మా స్వరాజ్ దివికేగసి అనేక మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. సుష్మా స్వరాజ్ పై తెలుగు డైలీ 24 ప్రత్యేక కథనం...
సుష్మా స్వరాజ్... ఆమె పేరుకు తగ్గట్టుగానే మనస్సు కూడా నిర్మలమైనది. 1952 ఫిబ్రవరి 14న సుష్మా స్వరాజ్ హర్యానలోని అంబాలలో జన్మించారు. కళాశాల విద్య వరకు అంబాలలోనే పూర్తి చేశారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా పొందారు. 1970 నుంచే విద్యార్ధి ఉద్యమాల్లో సుష్మా చురుకుగా పాల్గొన్నారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పని చేశారు. 1977లో తొలిసారి జనతాపార్టీ తరపున హర్యానా ఎమ్మెల్యేగా గెలిచారు. 1977 నుంచి 79 వరకు దేవీలాల్ ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. 1984 లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి 1987 నుంచి 1990 వరకు విద్య, ఆరోగ్య, సివిల్ సప్లై శాఖల మంత్రిగా పని చేశారు. 1980,1984,1989లో కార్నాల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటి చేసి ఓడిపోయారు. 1990లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 1996లో దక్షిణ ఢీల్లీ నుంచి ఎంపీగా గెలిచారు. అటల్ బీహారీ వాజ్ పేయ్ ప్రభుత్వంలో సమాచార, ప్రసారశాఖ మంత్రిగా పని చేశారు. 1998లో రెండో సారి ఎంపీగా గెలిచి అదే శాఖను నిర్వహించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశ్యంతో 1998లో సుష్మా స్వరాజ్ కు బీజేపీ ఢిల్లీ ఎన్నికల బాధ్యతలను అప్పగించింది. అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. దీంతో కేంద్ర మంత్రిమండలి నుంచి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సుష్మాను అధిష్టానం పంపించింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తొలి మహిళగా సుష్మా రికార్టు సృష్టించారు.
1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సోనియా గాంధీ కర్ణాటకలోని బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ తరఫున బలమైన మహిళా నాయకురాలిని నిలబెట్టాలని భావించి సుష్మాస్వరాజ్‌ను బరిలోకి దించారు. దేశ స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పార్టీ తప్ప మరే పార్టీ ఇక్కడినుంచి విజయం సాధించలేకపోవడంతో సోనియాగాంధీ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొంది. ఊహించినట్లుగానే సుష్మాస్వరాజ్ ఓడిపోయినా సోనియాపై పోటీచేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. 2000 సెప్టెంబర్ నుంచి 2003 వరకు సమాచార,ప్రసారశాఖ మంత్రిగా సుష్మా పని చేశారు. 2006లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. తెలంగాణ బిల్లు కోసం పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు తెలంగాణ ఇవ్వాల్సిందేనని గట్టిగా పట్టుబట్టి ప్రసంగించారు. ఆ ప్రసంగంతో తెలంగాణ ప్రజల గుండెల్లో ఆమె చోటు దక్కించుకున్నారు. అప్పటి నుంచి తెలంగాణ ప్రజలంతా సుష్మాస్వరాజ్ ని తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకుంటారు. మోదీ కేబినేట్ లో విదేశీ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. వేలాది మందికి ట్విట్టర్ వేదికగా స్పందించి సమస్యలను పరిష్కరించారు.
సుష్మాస్వరాజ్ కు 1975లో న్యాయవాది స్వరాజ్ కౌశల్ తో వివాహమైంది. వీరికి ఒక కూతురు. స్వరాజ్ కౌశల్ సుప్రీం కోర్టు న్యాయవాది. ఆయన మిజోరాం గవర్నర్ గా పని చేశారు. గత కొంత కాలంగా సుష్మా స్వరాజ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికి ట్విట్టర్ లో చురుకుగా ఉండేవారు. కాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి ఆమె ట్వీట్ చేశారు. మోదీ, అమిత్ షాజీ మీ నిర్ణయం అమోఘం అంటూ ఆమె వారిని అభినందించారు. ఇదే ఆమె చివరి ట్వీట్. ఆగష్టు 6, మంగళవారం రాత్రి ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. గుండె బరువును మోయలేనని, ఇక వీడ్కోలు అంటూ సుష్మాస్వరాజ్ నింగికేగిసారు. కోట్లాది మంది ప్రజలకు కన్నీటిని మిగిల్చారు. పార్టీలకతీతంగా సుష్మాస్వరాజ్ కు అభిమానులున్నారంటే ఆమెకు ఉన్న విలువ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
తెలంగాణతో ప్రత్యేక అనుబంధం
తెలంగాణ ఉద్యమ సమయాన ప్రత్యేక తెలంగాణకు మద్దతు పలికి తెలంగాణ ప్రజానికానికి అండగా నిలిచారు. 2009 నుంచి 2014 వరకు లోక్ సభలో ఆమె ప్రతిపక్ష నాయకురాలిగా వ్యవహరించారు. తెలంగాణ బిల్లు పై జరిగిన చర్చ సమయంలో ఆమె మాట మార్చకుండా మద్దతు ఇవ్వడంతో తెలంగాణ బిల్లు పాసైంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుగమంగా సాగింది. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే సుష్మా స్వరాజ్ తెలంగాణ ఎంపీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి యావతు ప్రజానీకం మరిచిపోదు. ‘తెలంగాణ సాకారంలో ఆ అమ్మ (సోనియా)నే కాదు.. ఈ చిన్నమ్మనూ గుర్తుంచుకోండి’’ అంటూ సుష్మా స్వరాజ్ మాట్లాడిన మాటలను యావత్తు తెలంగాణ ప్రజానీకం అభినందించింది. అప్పటి నుంచి సుష్మా స్వరాజ్ ని అంతా తెలంగాణ చిన్నమ్మగా పిలుస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలుసార్లు తెలంగాణకు విచ్చేసిన ఆమె మాట్లాడుతూ తాను తెలంగాణ చిన్నమ్మనంటూ గర్వంగా చెప్పుకున్నారు. తెలంగాణ చిన్నమ్మ మరణించడంతో అంతటా విషాద చాయలు అలుముకున్నాయి.
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.