(Local) Sat, 19 Oct, 2019

ఇరు రాష్ట్రాల సీఎంలు కీలక భేటీ...

September 23, 2019,   8:18 PM IST
Share on:
ఇరు రాష్ట్రాల సీఎంలు కీలక భేటీ...

ఈరోజు తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రగతి భవన్‌లో భేటీ కానున్నారు. ఈ భేటీలో గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించే అంశంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు చర్చించనున్నారు. ఈ విషయమై సహకరిస్తామని ఇప్పటికే కేసీఆర్‌ హామీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సీఎంల నిర్ణయానికి అనుగుణంగా ఇప్పటికే ఇరు రాష్ట్రాల ఇంజినీర్ల కమిటీలు విస్తృతంగా చర్చించాయి. తమ ప్రతిపాదనలను ఇద్దరు సీఎంలకు అందజేశాయి. 

ఆదివారం సీఎం కేసీఆర్‌ జగన్‌కు ఫోన్‌ చేసి ఎజెండా అంశాలను కూడా ఖరారు చేశారు. గోదావరి, కృష్ణా నదీ జలాల వినియోగం, తొమ్మిది, పదో షెడ్యూలులోని సంస్థల విభజన వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు. అధికారిక వ్యవహారాలతో పాటు ప్రధానంగా విపక్షాలను తిప్పికొట్టే వ్యూహాలనూ కూడా చర్చించనున్నారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఆదాయ వనరుల సమీకరణ, కేంద్ర సహకారం, నిధుల కేటాయింపు, తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చర్చించనున్నట్లు తెలిసింది.

సంబంధిత వర్గం
నేడు ఆర్టీసి కార్మికుల భవిష్యత్ కార్యాచరణ ప్రకటన
నేడు ఆర్టీసి కార్మికుల భవిష్యత్ కార్యాచరణ ప్రకటన
ఉద్యోగులకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్...
ఉద్యోగులకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.