(Local) Fri, 30 Jul, 2021

నీరా అనుబంధ ఉత్పత్తులపై మంత్రి సమీక్ష

November 27, 2019,   1:44 PM IST
Share on:

గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీ(Neera Policy)ని ప్రకటించారని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీవి . శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) తెలిపారు. రాష్ట్రంలో నీరా, అనుబంధ ఉత్పత్తులు తయారు చేయడానికి సంబంధిత శాఖాధికారులు, గీత వృత్తిదారుల ప్రతినిధులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

నీరా, అనుబంధ ఉత్పత్తుల తయారీలో భాగంగా నీరా సేకరణ, నిల్వచేయటం, ప్యాకింగ్, స్టోర్ పాయింట్ ఏర్పాటు, మోడల్ కేంద్రాల ఏర్పాటుపై ఈ బృందం రెండు రోజుల పాటు డా. YSR హార్టికల్చర్ యూనివర్సిటీలోని టాడి, అలైడ్ ప్రోడక్ట్స్ రీసెర్చ్ సెంటర్‌ను పరిశీలించి, అధ్యయనం చేసి నివేదికను అందజేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.