(Local) Mon, 12 Apr, 2021

మేము ఆర్టీసీకి ఎలాంటి అప్పూ చెల్లించాల్సిన అవసరం లేదు - ప్రభుత్వం

October 29, 2019,   4:20 PM IST
Share on:
మేము ఆర్టీసీకి ఎలాంటి అప్పూ చెల్లించాల్సిన అవసరం ల ...

ప్రభుత్వం నుంచి సంస్థకు దాదాపు రూ. 5 వేలకోట్ల బకాయిలు రావాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు చెబుతుండగా, అదంతా అబద్ధమని, అంత అప్పు లేమని ప్రభుత్వం అంటోంది. ఈమేరకు మంగళవారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఆర్టీసీకి  సంబంధించి తాము రూ. 1099 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం వివరించింది.బకాయిల్లో ఏపీ 58, తెలంగాణ 42 శాతం చెల్లించాల్సి ఉంటుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. విభజన తరువాత ఆర్టీసీ ఆస్తుల పంపకం జరగలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆస్తులు పంపకం ఎందుకు జరగలేదని కోర్టు ప్రశ్నించగా... అది కోర్టు పరిధిలోని అంశమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.
అయితే అధికారులు వాస్తవాలు దాచి పెడుతున్నారని ఈ సందర్భంగా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించిన అనంతరం... ఆర్టీసీ కార్మిక సంఘాల తరపున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.