(Local) Sun, 20 Oct, 2019

ప్రజల కోసం ‘జనతా జనార్ధన్' యాప్

August 26, 2019,   11:03 AM IST
Share on:
ప్రజల కోసం ‘జనతా జనార్ధన్' యాప్

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, అవినీతి లేకుండా చేసేందుకు ‘జనతా జనార్ధన్’ అనే యాప్ ను ప్రభుత్వం తీసుకురాబోతుంది.  ఈ యాప్ అందుబాటులోకి వస్తే దేశంలోనే విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టిన రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతుంది. సర్కార్ కు సంబంధించిన అన్నిశాఖల సమాచారాన్ని యాప్ లో పొందుపరుస్తారు. ప్రస్తుతమున్న వివిధ వెబ్ సైట్లు, పోర్టళ్లతో దీన్ని అనుసంధానం చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదిస్తే కేంద్ర వెబ్ సైట్లకు సైతం అనుసంధానం చేసేందుకు వీలుంటుంది. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఈ యాప్ ను తీసుకువచ్చేందుకు ఏడాదిన్నరగా కసరత్తు చేస్తున్నారు.  అన్నిరకాల డాటాబేస్ అధికారులు సిద్ధం చేస్తున్న ఈ యాప్ అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. సీఎం కేసీఆర్ పరిశీలన అనంతరం యాప్ ను విడుదల చేయనున్నారు.
యాప్ అందుబాటులోకి వస్తే….
ఒక వ్యక్తి తన ఫ్యామిలీ వివరాలన్నీ నమోదు చేయొచ్చు.
ప్రతి వ్యక్తికి యునిక్ ఐడెంటిటీ కోడ్ ను ఇచ్చి యాప్ లోకి ప్రవేశించే ఛాన్స్ కల్పిస్తారు. ఎవరి వివరాలను వారే పొందు పర్చుకునే విధంగా, ఒకరి వివరాలను మరొకరు చూడకుండా రక్షణ ఉంటుంది.
దీన్ని పూర్తిగా తెలంగాణ పౌరులే పొందేలా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. 
ప్రభుత్వ శాఖలు, ఎంప్లాయిస్, అధికారులు ఈ యాప్ లో భాగస్వాములు
భూ రికార్డులు, జనన, మరణ, కుల ధ్రువీకరణ పత్రాలు కూడా యాప్ నుంచి పొందవచ్చు

సంబంధిత వర్గం
ఇక పోరాటాల గడ్డ  నుంచి ఉద్యమం
ఇక పోరాటాల గడ్డ నుంచి ఉద్యమం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.