(Local) Sun, 20 Oct, 2019

టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి కూరుకుపోయింది- జేపీ నడ్డా

August 19, 2019,   11:42 AM IST
Share on:
టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి కూరుకుపోయింది- జేపీ న ...

టీఆర్ఎస్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో 3లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటని అన్నారు. బీజేపీలోకి చేరికలు చూసి టీఆర్ఎస్ కడుపు మండుతోందని ఎద్దేవా చేశారు. పలువురు టీఆర్ఎస్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. 

రాజకార్లతో పోరాడి గెలిచిన గడ్డపైకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశాన్ని ప్రగతి రథంలో నడిపించే సత్తా కేవలం బీజేపీకే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రయోజనాలు అవసరం లేదని మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దుపై దేశ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని.. కానీ కాంగ్రెస్ పార్టీకే అది నచ్చడం లేదన్నారు. కేవలం ఓటు బ్యాంక్ కోసమే ఇన్నిరోజులు ఆర్టికల్ 370ని కొనసాగించారని ఆరోపించారు. ఒకే దేశం- ఒకే రాజ్యాంగం విధానాన్ని మోడీ అమలు చేశారని అన్నారు. ప్రధాని మోడీ తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకంతో 55 కోట్ల మందికి లబ్ది చేకూరిందని తెలిపారు.

సంబంధిత వర్గం
ఆంధ్రా కాంట్రాక్టర్లకు కేసీఆర్ దోచిపెడుతున్నారు: న ...
ఆంధ్రా కాంట్రాక్టర్లకు కేసీఆర్ దోచిపెడుతున్నారు: న ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.