(Local) Fri, 05 Jun, 2020

ఉద్యోగులకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్...

September 23, 2019,   10:37 AM IST
Share on:
ఉద్యోగులకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్...

తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యోగుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో రెవెన్యూ వ్యవస్థ పై మాట్లాడిన ఆయన కాస్త ఘాటుగా మాట్లాడారు. ప్రభుత్వం చెప్పినట్టు ఉద్యోగులు వినాలి కానీ ఉద్యోగులు చెప్పినట్టు ప్రభుత్వం వినదన్నారు. కుక్క.. తోకను ఊపుతుందా!? తోక కుక్కను ఊపుతుందా!? ఉద్యోగులు ప్రభుత్వాన్ని నిర్దేశించే పరిస్థితి ఉండొద్దు. ఒకప్పుడు ఉన్న పటేల్‌, పట్వారీ వ్యవస్థ పోలేదా!? వారి అరాచకాలు ఎక్కువయ్యాయి కాబట్టి తీసేశారు. ఇప్పుడు వీఆర్వోలు వారి కన్నా డబుల్‌ అయితే.. తీసేయక తప్పదు కదా!’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. వీఆర్వోలు ఏమైనా పై నుంచి ఊడిపడ్డారా. వీఆర్వో వ్యవస్థను తీసేయాల్సి వస్తే తీసేస్తాం. సమ్మెకు వెళుతాం అని బెదిరిస్తే వారికే నష్టం. ప్రభుత్వం ఉద్యోగులకు భయపడుతుందా. అసలు ఉద్యోగులకు ఓట్లు ఉంటాయా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. చట్టాలు వ్యవస్థను నిర్దేశించేది ప్రభుత్వం,ఎమ్మెల్యేలు. వారు చెప్పినట్టు ఉద్యోగులు నడుచుకోవాలి. అంతేకానీ ఉద్యోగులు చెప్పినట్టు ప్రభుత్వం నడుచుకోదన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని జీతాలు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఇస్తుందన్నారు. అయినా కిరికిరి పెడుతామంటే చూస్తూ ఊరుకుంటామా. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులంటే అంత చిన్నచూపా అని కేసీఆర్ అన్నారు. ప్రజల కోసమే తాము ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం వ్యవస్థను నిర్దేశిస్తుంది. ఉద్యోగులు అమలు చేయాల్సిందే అన్నారు. సీఎం వ్యాఖ్యల పై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్యంలో తమకు కనీసం నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కు గతం నుంచి బెదిరింపు ధోరణి అలవాటని, అందరిని అదరగొట్టడంలో ఆయన దిట్ట అని అన్నారు. సీఎం బెదిరింపులకు తాము భయపడమని, చట్ట ప్రకారమే తాము ముందుకు వెళుతామన్నారు.
 

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.