(Local) Wed, 21 Aug, 2019

జగన్ తో కలిసి కొత్త అధ్యాయం లిఖించబోతున్నాం- కేసీఆర్

August 13, 2019,   10:46 AM IST
Share on:

తన కుమార్తె నగరి ఎమ్మెల్యే రోజా తనకు మంచి ఆతిథ్యమిచ్చారని, అన్నదాత, సుఖీభవ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను దీవించారు.  ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా నివాసంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు భోజనం చేశారు. అనంతరం నగరి నుంచి సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు బయల్దేరారు.

సోమవారం తమిళనాడు రాష్ట్రం కంచిలోని అత్తివరదరాజస్వామిని సీఎం కేసీఆర్‌ సకుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో చిత్తూరు జిల్లా నగరి పట్టణంలోని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా నివాసంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు. ఆయనకు ఎమ్మెల్యే రోజా, పూర్ణ కుంభంతో వేదపండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విలేకరుల సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు...రాయలసీమ ప్రజల ఇబ్బందులు తనకు తెలుసునని వందశాతం తన ఆశీస్సులు, సంపూర్ణ సహకారం ఏపీకి ఉంటుందని హామీ ఇచ్చారు. నీళ్ల విషయంలో ఇప్పటికే తాను, జగన్‌తో చర్చలు జరిపామని కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు ప్రాజెక్టులు నీళ్లతో కలకలలాడుతున్నాయని, ఆ నీరు వృధా కాకుండా ప్రజలకు ఉపయోగపడాలని ఒక నిర్ణయానికి వచ్చామన్నారు. 60 ఏళ్ల తెలుగువారి చరిత్రలో కొత్త అధ్యాయాన్ని జగన్‌తో కలిసి లిఖించబోతున్నామని కేసీఆర్ అన్నారు.ఈ నిర్ణయం కొందరికి జీర్ణంకాక, అజీర్తి కావొచ్చని అన్నారు. ప్రజల దీవెన ఉంటే రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి, దేవుడిచ్చిన సకలశక్తులను ఒడ్డుతామని సీఎం కేసీఆర్ అన్నారు.

సంబంధిత వర్గం

సీఎం జగన్ హిందువులను అవమానించారు - బీజేపీ ఎంపీ ట్వ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.