(Local) Sat, 26 Sep, 2020

డ్రోన్ వ్యవహారంపై కోర్టుకు టిడిపి నేతలు

August 20, 2019,   11:51 AM IST
Share on:
డ్రోన్ వ్యవహారంపై కోర్టుకు టిడిపి నేతలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై డ్రోన్ కెమెరాతో విజువల్స్ తీయడంపై టీడీపీ సీరియస్ గా ఉంది. హై సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలోకి డ్రోన్ కెమెరాలు వెళ్లడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రైవేట్ కేసు దాఖలు చేసి కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. అయితే చంద్రబాబు ఇంటిపై డ్రోన్ ఎగరడంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. వరదను అంచనా వేసేందుకు ఇరిగేషన్ అధికారులు డ్రోన్ కెమెరాను పంపించారని… అయితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వక పోవడం వల్లే వివాదం ఏర్పడిందన్నారు. ఈ వివాదంపై చంద్రబాబు ఇప్పటికే డీజీపీ తో పాటు, ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. డ్రోన్ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ నేతలు ఒకరినొకరు దూషించుకుంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

సంబంధిత వర్గం
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.