(Local) Wed, 21 Aug, 2019

బీజేపీలో చేరిన టీడీపీ పార్టీల నాయకులు

August 02, 2019,   11:24 AM IST
Share on:

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ పార్టీకీ చెందిన పలువురు నాయకులు గురువారం బీజేపీలో చేరారు.

నిన్న సాయంత్రం ఢిల్లీలో భాజపా ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో భాజపా లోకి చేరికలు జరిగాయి.వీరిలో ముఖ్యంగా కర్నూలు జిల్లా నుండి మాజీ ఎమ్మెల్యే,ఎంపీ,గంగుల ప్రతాప్ రెడ్డి గారు,
సామాజికవేత్త పసుపులేటి సుధాకర్ గారు,తెదేపా నుండి కంచర్ల హరిప్రసాద్ గారు, IRS మాజీ ఆదాయపన్ను శాఖ కమీషనర్,తెదేపా గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ షైక్ నిజాముద్దీన్ గారు,ప్రముఖ వ్యాపారవేత్త మజర్ బైగ్ గారు, చిత్తూరు జిల్లా తెదేపా ఓబీసీ కార్యదర్శి డి. వెంకయ్య గారు తదితరులు వారి అనుచరులతో బీజేపీలో చేరారు. 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్షీనారాయణ వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత వర్గం

ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలలో ఇన్‌ఛార్జులు నియ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.