(Local) Sat, 19 Oct, 2019

జగన్‌కు మాజీ మంత్రి బహిరంగ లేఖ

September 06, 2019,   1:37 PM IST
Share on:
జగన్‌కు మాజీ మంత్రి బహిరంగ లేఖ

విశాఖపట్నం భూ కుంభకోణం కేసులో మళ్లీ దర్యాప్తు జరిపించాలని గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రిని కోరారు. ఈ కేసులో దర్యాప్తు జరిపించాలని పలువురు వైసీపీ నేతలు కోరుతున్నారనీ, వారి డిమాండ్ ను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో సిట్ ద్వారా విచారణను పున: ప్రారంభించాలని కోరారు. ఈ విషయంలో ఎంత పెద్దవారున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విశాఖ భూ కుంభకోణం వెనుక ఎవరు ఉన్నారో ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గంటా శ్రీనివాసరావు తెలిపారు. తాను మంత్రిగా ఉండగా సిట్ నివేదికను బయటపెట్టాలని కోరారనీ, అయినా బయటపెట్టలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ నివేదికలోని విషయాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు గంటా శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వర్గం
ఆర్టీసి పై సీఎం జగన్ మరో నిర్ణయం
ఆర్టీసి పై సీఎం జగన్ మరో నిర్ణయం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.