(Local) Sat, 10 Apr, 2021

కొడాలి నాని, వంశీ వల్లే జూ.ఎన్టీఆర్ టీడీపీకి దూరం: బోండా

November 21, 2019,   12:37 PM IST
Share on:
కొడాలి నాని, వంశీ వల్లే జూ.ఎన్టీఆర్ టీడీపీకి దూరం: ...

కొడాలి నాని, వల్లభ నేని వంశీ వల్లే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారని టీడీపీ నేత బోండా ఉమా వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుంది కొడాలి నాని, వంశీ అని అన్నారు. వీళ్లకు టికెట్స్ కోసం స్వార్థంతో ఎన్టీఆర్ ను వాడుకున్నారని ఆరోపించారు. కొడాలి నాని టీడీపీలో గెలిచి వైసీపీలో చేరలేదా అని ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసమే వంశీ టీడీపీని వీడారన్నారు. వంశీకి చంద్రబాబు రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్, ఓసారి ఎంపీ టికెట్ ఇచ్చారని, ఇప్పుడు మాట్లాడే మాటలు అప్పుడెందుకు మాట్లాడలేదన్నారు. సొంత ప్రయోజనాల కోసమే వంశీ, దేవినేని అవినాశ్ పార్టీని వీడారని చెప్పారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.