(Local) Mon, 17 May, 2021

డైలామా లో టిడిపి అధినేత

August 19, 2019,   11:26 AM IST
Share on:
డైలామా లో టిడిపి అధినేత

టీడీపీ    అధినేత చంద్రబాబు నాయుడుకు వరుస దెబ్బలు తాకుతున్నాయి. ఇటీవల టీడీపీ నుంచి కొంత మంది ఎంపీలు బీజేపీలో చేరారు. మరో వైపు మరికొంత మంది ఎమ్మెల్యేలు,కీలక నేతలకు కాషాయం గాలం వేస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో కూడా భారీ స్థాయిలో నేతలు ఆదివారం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో చంద్రబాబు ఉన్నారట. పార్టీ మార్పులు గతంలో కూడా జరిగినప్పటికి కింది స్థాయి నేతలకు దగ్గరగా ఉండే నేతలే పార్టీ నుంచి దూరం కావడంతో చంద్రబాబుకు కాస్త టెన్షన్ పెరిగిందని తెలుస్తోంది. అందుబాటులో ఉన్న నేతలతో ఆయన ఇప్పటికే సమావేశమయ్యారని, పార్టీ అభివృద్ది కోసం చేయాల్సిన కార్యక్రమాల పై ఆయన చర్చించారని తెలుస్తోంది. మొత్తానికి వరుస ఎదురుదెబ్బలు తాకుతుండడంతో చంద్రబాబు కాస్త డైలమాలో పడ్డారని కీలక నేతలు చర్చించుకుంటున్నారు.

సంబంధిత వర్గం
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.