(Local) Wed, 21 Oct, 2020

ఆయారాం, గయారాంలకు స్వస్తి పలుకుదాం: చంద్రబాబు

November 25, 2019,   11:23 PM IST
Share on:
ఆయారాం, గయారాంలకు స్వస్తి పలుకుదాం: చంద్రబాబు

అధికారంలో ఉన్నప్పుడు వచ్చిపోయే ఆయారాం, గయారాంలకు స్వస్తి పలుకుదామని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానింంచారు. కడప జిల్లాలో పర్యటన సందర్భంగా రైల్వేకోడూరు, రాజంపేట, బద్వేలు, రాయచోటి నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సంస్థాగత ఎన్నికల్లో పార్టీకి సేవ చేసిన వారినే ఎన్నుకోవాలని కోరారు. అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, ఎంత అణగదొక్కాలని చూస్తే అంత పైకి లేస్తామన్నారు. ఇసుక కొరత లేదని చెబుతున్న సీఎం జగన్.. కడప ఇసుక బెంగళూరులో ఎందుకు ప్రత్యక్షమవుతుందో చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పాలన తిరోగమనంలో ఉందన్నారు. పులివెందుల, పుంగనూరుకు మాత్రమే నిధులు విడుదల చేస్తే మిగిలిన నియోజకవర్గాల ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.