(Local) Wed, 21 Aug, 2019

ఈ రోజు సాయంత్రం సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు

August 07, 2019,   10:13 AM IST
Share on:

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అకాల మృతి అందరిని షాక్ కు గురి చేసింది. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. దేశం ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం సాయంత్రం సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నాం 12 గంటల నుంచి 3 గంటల వరకు పార్టీ కార్యకర్తలు, నేతల సందర్శనార్దం సుష్మ భౌతికకాయాన్ని ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఉంచనున్నారు. అనంతరం అంతిమ యాత్ర ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు లోదీ స్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో సుష్మ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

సంబంధిత వర్గం

దేశమంతా హై అలెర్ట్ ప్రకటించిన కేంద్రం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.