(Local) Mon, 27 Sep, 2021

కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలపై సుప్రీం సంచలన తీర్పు

November 13, 2019,   1:03 PM IST
Share on:
కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలపై సుప్రీం సంచలన తీర్పు

కర్ణాటక రెబల్స్ ఎమ్మెల్యేల భవితవ్యంపై సుప్రీం కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హులుగా ప్రకటించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్ధించింది. కానీ, వారిని ఉప-ఎన్నికల్లో పోటీకి అనుమతించింది. ఈమేరకు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. అసెంబ్లీ గడువు ముగిసే వరకూ ఓ ఎమ్మెల్యేను స్పీకర్ అనర్హుడిగా ప్రకటించలేరని తెలిపింది. అనర్హులు ఉప ఎన్నికలలో పోటీ చేయవచ్చని, నామినేషన్లు దాఖలు చేయవచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు, ఎమ్మెల్యేగా ఎన్నికైతే క్యాబినెట్‌లో మంత్రిగా చేరవచ్చని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో రెబల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. మొత్తం 17 స్థానాలకు ఉప-ఎన్నికలు డిసెంబరు 5న జరగనుండగా, ఈ రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థులుగా బరిలో దిగనున్నారు.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.