(Local) Mon, 17 May, 2021

టీచర్ల నియామకంపై సుప్రీం కోర్టులో విచారణ

August 20, 2019,   11:28 AM IST
Share on:
టీచర్ల నియామకంపై సుప్రీం కోర్టులో విచారణ

ఏపీ, తెలంగాణలో టీచర్ల నియామకంలో జాప్యంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. టీచర్ పోస్టుల భర్తీ, స్కూళ్లలో మౌలిక వసతులపై ఏపీ, తెలంగాణ సీఎస్ లు అఫిడవిట్లు దాఖలు చేశారు. సెప్టెంబర్ 4 వరకు టీచర్ల నియామకాన్ని పూర్తి చేస్తామని, స్కూళ్లలో వసతులపై కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని ఏపీ సర్కార్ తెలపడంతో కోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు తెలంగాణలో 2వేల టీచర్ల నియామకాలు పూర్తి చేశామని.. మరో 4,444 పోస్టుల భర్తీపై హైకోర్టులో పిటిషన్ ఉండటంతో ఆలస్యమవుతుందని సీఎస్ జోషి అఫిడవిట్ దాఖలు చేశారు. తెలంగాణ అంశాన్ని వచ్చేవారం విచారిస్తామని కోర్టు పేర్కొంది.

సంబంధిత వర్గం
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.