(Local) Mon, 28 Sep, 2020

శబరిమల ఆలయం నిర్వహణకు కొత్త చట్టాలు...

November 20, 2019,   6:33 PM IST
Share on:
శబరిమల ఆలయం నిర్వహణకు కొత్త చట్టాలు...

కేరళలోని శబరిమల కనుమల్లో నెలకొన్న అయప్పస్వామి ఆలయ నిర్వహణకోసం కొత్త చట్టాలు రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శబరిమల ఆలయంపై పండలమ్ రాయల్ ఫ్యామిలీ తమ హక్కులను పరిరక్షించాలంటూ వేసిన పిటిషన్ పై విచారణ జరిపింది. వచ్చే ఏడాది జనవరి మూడవ వారంలోపు కొత్త చట్టం తీసుకురావాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అన్ని ఆలయాలను కలిపి ఒకే చట్టం కిందకు తీసుకురావడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమల ఆలయాన్ని ప్రత్యేకంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. భక్తుల సౌకర్యాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొంది.

అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన సమీక్ష పిటిషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు విచారించిన విషయం తెలిసిందే. ఆలయంలోకి మహిళల ప్రవేశం సహా ఇతర మతపరమైన అంశాలను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం పరిశీలిస్తుందని గత గురువారం సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ వ్యవహారాన్ని ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, గతంలో ఇచ్చిన తీర్పుపై ఎలాంటి స్టే విధించలేదు. అయినప్పటికీ భద్రతా కారణాలరీత్యా 10-50ఏళ్ల లోపు మహిళలను అనుమతించకుండా కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వర్గం
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న బోబ్డే
చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న బోబ్డే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.