(Local) Wed, 21 Oct, 2020

ఇంగ్లీష్ మీడియంతో ప్రజలు అటూ ఇటూ కాకుండా పోతారు: సుజనా

November 21, 2019,   5:40 PM IST
Share on:
ఇంగ్లీష్ మీడియంతో ప్రజలు అటూ ఇటూ కాకుండా పోతారు: స ...

ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేస్తామని బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. ఇంగ్లీష్ మీడియం వల్ల విద్యార్థులు అటూ ఇటూ కాకుండా పోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. గతంలో కొన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభిస్తే అంత స్పందన రాలేదన్నారు. విద్యావేత్తల అభిప్రాయం తీసుకుని నిర్ణయాన్ని అమలు చేస్తే బాగుండేదన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి సీఎం జగన్ అలా మాట్లాడటం సరికాదన్నారు. మైసూరులో ఉన్న తెలుగు అధ్యయన కేంద్రం ఏపీకి రావడానికి వెంకయ్యనాయుడు ఎంతో కృషి చేశారన్నారు.

వైసీపీ సర్కార్ పరిపాలనపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత కక్ష సాధింపుపై చర్యలు చేపట్టిందన్నారు. ఒక మతానికి ఎక్కువగా రాయితీలు ఇస్తే ప్రజల మధ్య మనస్పర్థలు వస్తాయని... మత సంబంధ సంస్థల నుంచి రాయితీలు ఇచ్చుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు కానీ... ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వొద్దన్నారు. టీటీడీ నిధులు ఇతర అవసరాలకు వినియోగించొద్దన్నారు. జగన్ ఇప్పటికైనా ఎన్నికల కోణం నుంచి బయటకు వచ్చి పాలనపై దృష్టి సారించాలన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.