(Local) Mon, 27 Sep, 2021

రోజ్‌వ్యాలీ స్కాంకు దస్త్రాలు సమర్పించండి: సీబీఐ

October 18, 2019,   12:15 PM IST
Share on:
రోజ్‌వ్యాలీ స్కాంకు దస్త్రాలు సమర్పించండి: సీబీఐ

పశ్చిమబెంగాల్‌ కేంద్రంగా జరిగిన రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్‌ స్కాంకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు  ఆ రాష్ట్ర సచివాలయాన్ని సందర్శించారు. కొందరు అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఉదయాన్నే సచివాలయానికి చేరుకున్నకేంద్ర దర్యాప్తు బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ సిన్హాతో పాటు భూ సంబంధిత శాఖ ఓ ఎస్డీ రెండు లేఖలు అందజేశారు. ఈ సందర్భంగా ఈ స్కాంకు సంబంధించిన దస్త్రాలు సమర్పించాలని సీబీఐ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అక్టోబర్‌ 18 కల్లా రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్‌ స్కాంకు సంబంధించిన దస్రాలతో హాజరుకావాలని భూముల శాఖ ఓఎస్టీకి సమన్లు జారీ చేశారు. రోజ్‌వ్యాలీ గ్రూప్‌నకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన భూ లావాదేవీల వివరాలు సైతం ఇవ్వాలని కోరారు. ఈ దర్యాప్తులో భాగంగా సాధారణంగానే సచివాలయానికి వచ్చామని సీబీఐ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. ఈ కేసులో తమకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీబీఐ అధికారులు కోరినట్లు సమాచారం.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.