(Local) Mon, 17 May, 2021

ఏపి ఎక్సైజ్‌ శాఖలో సమ్మె నిషేధం

August 19, 2019,   3:44 PM IST
Share on:
ఏపి ఎక్సైజ్‌ శాఖలో సమ్మె నిషేధం

ఏపి ఎక్సైజ్‌ శాఖలో ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఆధ్వర్యంలో దుకాణాలు రానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రిటైల్‌ దుకాణాల నిర్వహణను ఆ సంస్థకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి నూతన మద్యం విధానాన్ని ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సమ్మె నిషేధ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

సంబంధిత వర్గం
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.