
గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ తో కలిసి పోరాటం చేసిన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు కేసీఆర్‌కే వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు ధర్నాలు, నిరసనలు చేస్తుంటే ప్రైవేట్ పరమైన చేస్తా కానీ ప్రభుత్వపరం చేసేదీ లేదని అంటున్నాడు కేసీఆర్.గత పది రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తుంటే కేసీఆర్ మాత్రం తన పంతం వదలట్లేదు. నిన్న జరిగిన సమావేశంలో ఆర్టీసీ జేఏసీకి మిగిలిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు తప్పంతా ఆర్టీసీ జేఏసీదేనని అంటున్నారు. మొదట్లో కార్మికులకు అండగా నిలిచిన ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ, కార్మికుల వలనే పరిస్థితి ఇంతదాకా వచ్చిందని ఆరోపిస్తున్నారు. ఒక్కపక్క ధర్నాలతో, నిరసనలతో కార్మికులు రెచ్చిపోతుంటే శనివారం ఖమ్మం డిపో డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నం, ఆదివారం ఆయన మరణించటంతో కార్మికుల ఉద్యమం మరో స్థాయికి చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న సదుపాయాలన్ని ఆర్టీసీ ఉద్యోగులు కూడా పొందవచ్చనే ఆశతో వారు విలీనం చేయమంటుంటే కేసీఆర్ విలీనం చేసేదీ లేదు అంటున్నాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే 48,000 కుటుంబాలు బాగుపడతాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే నష్టాలు, లాభాలు రెండు సమతూకమే.
ఇన్ని పనులు చేసిన సీఎం కేసీఆర్ ప్రతిరోజు పనిచేసే ఆర్టీసీ కార్మికుల జీవితాల గురించి ఆలోచించకుండా ఉంటాడా? ఆర్టీసీ ధర్నా వలన నష్టపోయేది కార్మికులు, ప్రజలు మాత్రమే. శనివారం ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసుకోవటం, ఆదివారం మరణించటంతో ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి సీఎం పుల్ స్టాప్ పెడతాడనుకుంటే ఎవరూ ఉహించని విధంగా డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసి కార్మికులను ఇంకా రెచ్చగొట్టాడు.ఇంతా జరుగుతున్న నష్టపోయేది మాత్రం కార్మికుడే. ఈ రోజు ఖమ్మం శ్రీనివాస్ రెడ్డి మరణించాడు, అసలు కార్మికులు ఈ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించకుంటే శ్రీనివాస్ రెడ్డి మన మధ్యనే బస్సు నడుపుతూ ఉండేవాడు కదా అని ఏ ఒక్క కార్మికుడు కూడా ఆలోచించలేదు. ఒక్క డ్రైవర్ మరణించేదాకా ఈ ధర్నాలను, నిరసనలను తీసుకొచ్చిన ఘనత మాత్రం సీఎం కేసీఆర్ దే. ఇన్ని పథకాలు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు లాంటి పథకాలను జయప్రదంగా అమలులోకి తెచ్చిన సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయ్యటమో లేక ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచటమో చేస్తే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు.
ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి మరణించిన వార్త తెలిసి కూడా సీఎం కేసీఆర్ ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ తో ఈ పరిస్థితి ఉద్యమంలా కొనసాగేలా ఉంది తప్పా సమాప్తమయ్యేలా కనిపించటం లేదు.ఈ విషయమై ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కానీ రాష్ట్రంలో ఏ చిన్న విషయం జరిగినా స్పందించే మంత్రి హరీష్ రావు ఆర్టీసీ పైన గానీ, మరణించిన శ్రీనివాస్ రెడ్డి పైన గానీ స్పందించకపోవడం విచిత్రం. ఈ పోరాటంలో కార్మికులు తమ ప్రాణాలను పొగొట్టుకోవడమే తప్ప లాభాపడేదేమీ లేదు. సీఎం కేసీఆర్ ఇకనైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన స్పందించి కొంతలో కొంతైనా న్యాయం చేస్తే కార్మికులు సమ్మెను విరమించి విధులలో చేరే అవకాశముంది. ససేమిరా అంటూ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నేరవేర్చేది లేదంటే ఆర్టీసీ కార్మికుల ఉద్యమం మరో స్థాయికి వెళ్లే అవకాశముంది.
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.