(Local) Thu, 09 Apr, 2020

చంద్రబాబునాయుడి కాన్వాయ్ పై వైసిపి నేతల దాడి

November 28, 2019,   2:02 PM IST
Share on:
చంద్రబాబునాయుడి కాన్వాయ్ పై వైసిపి నేతల దాడి

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడి అమరావతి పర్యటన సందర్భంగా రాజధాని ప్రాంతంలో తీవ్ర ఉద్రక్తత చోటు చేసుకున్నది. చంద్రబాబునాయుడి కాన్వాయ్ పై వైసిపి నేతలు చెప్పులతో దాడి చేశారు. చంద్రబాబు రాక సందర్భంగా భారీగా పోలీసులు మోహరించినా వైసిపి నేతలు రెచ్చిపోయారు. రాజధాని ప్రాంతంలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ బాహాబహి జరిగింది. ఒకరిపై ఒకరి వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ రెచ్చిపోయారు. ఈ దశలో పోలీసులకు టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. వెంకటపాలెంలో టీడీపీ వారికి అనుమతి లేదంటూ పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఉద్దండరాయునిపాలెంలో టీడీపీకి అనుమతి ఉందంటూ టీడీపీ నాయకులకు తుళ్లూరు డీఎస్పీ తెలిపారు.

 

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.