(Local) Fri, 15 Nov, 2019

బీజేపీ పై ఫైర్ అయ్యిన శ్రీనివాస్ గౌడ్

August 25, 2019,   12:35 PM IST
Share on:
బీజేపీ పై ఫైర్ అయ్యిన శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ పై ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను బీజేపీ జీర్ణించుకోలేక పోతుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. బీజేపీ మాదిరిగా టీఆర్ఎస్ పార్టీవి మిస్డ్ కాల్  సభ్యత్వాలు కాదని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు విమర్శలు మానుకోవాలని, చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు ప్రశంసించారని గుర్తు చేశారు.

సంబంధిత వర్గం
శబరిమల పై రేపే అంతిమ తీర్పు
శబరిమల పై రేపే అంతిమ తీర్పు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.