(Local) Mon, 12 Apr, 2021

నిత్య విద్యార్థిగా జ్ఞాన సముపార్జన చేయాలి - స్మృతి ఇరానీ

November 13, 2019,   3:42 PM IST
Share on:
నిత్య విద్యార్థిగా జ్ఞాన సముపార్జన చేయాలి - స్మృతి ...

చెన్నైలో మంగళవారం వేలూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవానికి కేంద్ర మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యాభ్యాసానికి అంతంలేదని ప్రతి ఒక్కరూ జీవితాంతం నిత్య విద్యార్థిగా ఉంటూ జ్ఞానాన్ని సముపార్జించాలని పేర్కొన్నారు. వీఐటీ అత్యున్నత ప్రమాణాలతో విద్యనందిస్తోందని కొనియాడుతూ కళాశాల స్థాపకులు, కులపతి విశ్వనాథన్‌ను ఆమె ప్రశంసించారు. అలాగే కళాశాల ప్రతిష్టాత్మక ఎమినెన్స్‌ స్టేటన్‌ సాధించడంపై హర్షం వ్యక్తంచేశారు. రూ.31 కోట్లతో కళాశాలలో నిర్మించిన ఆడిటోరియాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం, ఉప కులపతి ఆనంద్‌ ఎ.శామ్యూల్‌ ప్రో వైస్ ఛాన్సలర్లు నారాయణ, కాంచనా భాస్కరన్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.