(Local) Wed, 23 Sep, 2020

శ్రీనగర్ లో సీతారాం ఏచూరికి చేదు అనుభవం

August 09, 2019,   9:24 PM IST
Share on:
శ్రీనగర్ లో సీతారాం ఏచూరికి చేదు అనుభవం

జమ్మూకాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడ పర్యటించడానికి వెళ్లిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజాకు శ్రీనగర్‌ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ప్రార్థనలు సందర్భంగా కశ్మీర్‌లో కర్ఫ్యూ సడలించే ఆలోచనలో అధికారులున్నందున సిటీలోకి అడుగుపెట్టకుండా సీతారాం ఏచూరి, డి.రాజాలను విమానాశ్రయంలోనే నిలిపివేశారు. శ్రీనగర్‌లో ఎలాంటి ప్రవేశానికి అనుమతిలేదంటూ లీగల్ ఆర్డర్‌ను అధికారులు చూపించారని, సెక్యూరిటీ కారణాల వల్ల ఎస్కార్ట్‌తో కూడా వెళ్లడాన్ని అనుమతించడం లేదని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారని, అయితే అధికారులతో సంప్రదించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని ఏచూరి మీడియాతో ఫోనులో తెలిపారు. పార్టీ విభాగం సభ్యులతో సమావేశమయ్యేందుకు సీతారాంఏచూరి ఇక్కడకు వచ్చారు. 

సంబంధిత వర్గం
జమ్మూ కాశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
జమ్మూ కాశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.