(Local) Fri, 22 Oct, 2021

రైల్వేశాఖకు దిమ్మతిరిగే షాక్

October 04, 2019,   10:22 AM IST
Share on:
రైల్వేశాఖకు దిమ్మతిరిగే షాక్

దసరా సీజన్ లో రైల్వే శాఖ వేసిన ఎత్తుగడకు ప్రయాణికులు మాస్టర్ ప్లాన్ వేశారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ల రేట్లు పెంచడం తెలిసిందే. రూ. 10గా ఉన్న ప్లాట్ ఫామ్ టికెట్ ను అధికారులు 30కి పెంచేశారు.ఇక్కడే చిర్రెత్తుకుపోయిన ప్రయాణికులు అధికారులకు దిమ్మతిరిగేలా షాకింగ్ ఆలోచనకు తెరలేపారు. ప్లాట్ ఫామ్ టికెట్ కొనాలంటే రూ.30 అవుతుంది. దీంతో ప్లాట్ ఫామ్ టికెట్ కు బదులు పాసింజర్ ట్రైన్ టికెట్ కొనడం మొదలుపెట్టారు.
పాసింజర్ ట్రైన్ కు మినిమమ్ ఛార్జీ రూ.10 ఉంది. ప్లాట్ ఫామ్ టికెట్ కు బదులుగా దర్జాగా పాసింజర్ ట్రైన్ టికెట్ కొనుక్కుని రైల్వే శాఖకు షాకిస్తున్నారు ప్రయాణికులు. అంతటితో ఆగకుండా తిరిగి స్టేషన్ నుండి భయటకు వస్తూ వస్తూ ఆ టికెట్ ను వేరే వారికి ఇచ్చేస్తున్నారట. ఒకటి తలిస్తే మరొకటి జరగడంతో విస్తుపోవడం రైల్వే శాఖ అధికారుల వంతైంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.