(Local) Sun, 20 Jun, 2021

శివసేనకే సీఎం పదవి ఇవ్వాలి

October 24, 2019,   1:51 PM IST
Share on:
శివసేనకే సీఎం పదవి ఇవ్వాలి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో సీఎం పదవి తమకే ఇవ్వాలని శివసేన ముఖ్యనేత సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పదవులు కూడా సగం సగం పంచుకోవాలన్నారు. గతంలో కంటే బీజేపీకి సీట్లు తగ్గి శివసేనకు పెరుగుతున్న నేపథ్యంలోనే వారు ముఖ్యమంత్రి పదవి అడుగుతున్నారని సమాచారం. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేవంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. అయితే మొదటి నుంచి శివసేనలో ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి చర్చ జరగలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేయగా బీజేపీ 122 స్థానాల్లో గెలిచింది. అనంతరం శివసేన సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.