
మహారాష్ట్రను పాలించాలని ఆరాటపడిన శివసేన, చివరకు రెంటికి చెడిన రేవడిలా మారింది. బీజేపీతో తెగతెంపులు చేసుకుని, కాంగ్రెస్-ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. సోమవారం సాయంత్రం శివసేనకు అనుకూలంగా ఉంటుందని చాలా మంది భావించినా సీన్ రివర్స్ అయింది. మెజారిటీ బలాన్ని చూపకపోవడంతో సేనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రాలేదు. ఎన్సీపీకి గవర్నర్ ఆహ్వానం అందింది. ఇది శివసేనకు మింగుడు పడని విషయం. ఇక భవిష్యత్తులో శివసేన బలహీనపడుతుందని, మరాఠా గడ్డపై తమకు తిరుగుండదని కమలనాథులు అంచనా వేస్తున్నారు.
మరాఠా గడ్డపై రాజకీయం శరవేగంగా మారిపోయింది. శివసేనకు అందినట్టే అందిన అధికారం చేజారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని శివసేన పోటీ చేసింది. ఈ కూటమికి ప్రజలు మెజారిటీ సీట్లను కట్టబెట్టారు. ఆ తర్వాత సీఎం పదవి కోసం సేన పట్టుబట్టింది. బీజేపీ ఒప్పుకోలేదు. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలపడానికి ఉద్దవ్ థాకరే ప్రయత్నించారు. బీజేపీ వ్యూహాత్మకంగా ప్రభుత్వ ఏర్పాటుకు దూరంగా ఉండటంతో శివసేనకు గవర్నర్ నుంచి పిలుపు వచ్చింది. సోమవారం రోజంతా ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుకోసం శివసేన చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో ఎన్సీపీని గవర్నర్ ఆహ్వానించారు.
మహారాష్ట్రలో శివసేనకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సీఎం పదవికోసం చిరకాల మిత్రపక్షం బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. అతిపెద్ద పార్టీ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేదు. దీంతో రెండో అతిపెద్ద పార్టీగా శివసేనకు గవర్నర్ ఆహ్వానం పంపారు. దీంతో ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఉద్దవ్ థాకరే భావించారు. ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఎన్నడూ లేనిది, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో ఉద్దవ్ చర్చించారు. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. అయితే, తమ మిత్రపక్షం కాంగ్రెస్ ను సంప్రదించిన తర్వాతే ఏ విషయం చెప్తామన్నారు పవార్. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ విషయమై ఎటూ తేల్చకుండా డైలమాలో పడ్డారు.
ఈలోగా గవర్నర్ విధించిన 24 గంటల గడువు ముంచుకు రావడంతో శివసేన తరఫున ఆదిత్య థాకరే, మరో ఇద్దరు నాయకులు రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ ను కలిశారు. సోమవారం సాయంత్రం 7 గంటలకు వారు గవర్నర్ తో భేటీ అయ్యారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, ఎన్సీపీతో చర్చలు జరుపుతున్నామనీ కాబట్టి మరో రెండు రోజుల సమయం కావాలని కోరారు. దీనికి గవర్నర్ కోషియారీ ఒప్పుకోలేదు. శివసేనకు మరింత గడువు ఇవ్వడానికి గవర్నర్ ఒప్పుకోక పోవడంతో ఇక రాష్ట్రపతి పాలనే తరువాయి అని చాలా మంది భావించారు. ఇంతలో ఊహించని ట్విస్ట్. మూడో అతిపెద్ద పార్టీ ఎన్సీపీని గవర్నర్ ఆహ్వానించారు.
శివసేన ఇప్పుడు అయోమయంలో పడింది. ఓ పక్క, బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. మోదీ ప్రభుత్వంలో ఉన్న తమ మంత్రి అరవింద్ సామంత్ తో రాజీనామా చేయించింది. మరో పక్క, సెక్యులర్ పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు కోసం ప్రయత్నించి అభాసు పాలైంది. అటు బీజేపీ అండను కోల్పోయింది. ఇటు హిందూత్వ ఇమేజి మసకబారింది. అయినా సీఎం పదవి దక్కలేదు. తాజాగా ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మద్దతు ఇవ్వాలా వద్దా అనే ప్రశ్న తలెత్తింది. ఎన్సీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేకంటే బీజేపీతోనే ఉంటే పోయేది కదా అని ఇప్పుడు శివసైనకులు మధనపడుతున్నారు.
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.