(Local) Sun, 20 Oct, 2019

సీట్ల విషయంలో బీజేపీ మాకు అనుకూలం

September 16, 2019,   4:40 PM IST
Share on:
సీట్ల విషయంలో బీజేపీ  మాకు అనుకూలం

మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా భారతీయ జనతాపార్టీ ,శివసేన  మధ్య జరిగిన సీట్ల పంపకం చర్చలు విఫలమయ్యాయి. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే తన నివాసం మాతోశ్రీలో మొత్తం 288 సీట్లలో తమ వంతు సీట్ల విషయంలో ఎంపిలు, ఎమ్మెల్యేలతో సమావేశమైయ్యారు . శివసేన సీనియర్‌ నిర్వాహకుడు మాట్లాడుతూ ప్రస్తుతం మేము ఎన్నికల గురించే చర్చిస్తున్నాము. ఉద్ధవ్‌ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ఎన్నికల గురించి చర్చిస్తున్నారన్నారు. గత ఎన్నికలప్పుడు మేము ఏర్పాట్లు సరిగా చేసుకోలేకపోయాము.

ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నామన్నారు. అధికార పార్టీతో ఫిఫ్టీ - ఫిఫ్టీ ఫార్ములా ఉండాలని ఒత్తిడి చేయడం వల్ల ఘర్షణ జరిగిందన్నారు. సీట్ల విషయంలో బిజెపి తమకు అనుకూలంగానే ఉందన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్‌తో చర్చిస్తున్నామని సేనా నిర్వాహకుడు చెప్పారు. బిజెపి ఎమ్మెల్సీ ప్రసాద్‌ మాట్లాడుతూ బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలోనే సెప్టెంబర్‌ 19న నాసిక్‌లో సీట్ల పంపకాల ప్రకటన ఉంటుందన్నారు. శివసేనా నాయకుడు యువసేనా అధ్యక్షుడు అదిత్య థాకరే ప్రస్తుతం కొంకణ్‌లో జై ఆశీర్వాద్‌ యాత్ర నిర్వహిస్తున్నాడరు. ముఖ్యమంత్రి ప్రెస్‌కాన్ఫరెన్స్‌ మాట్లాడిన దాన్ని బట్టి తమ నిర్ణయం ఉంటుందని, సేన ఎట్టిపరిస్థితుల్లోను మోసపోదని ఆదిత్య అన్నారు.

సంబంధిత వర్గం
దేశ రాజకీయాల్లో విలువలను టీడీపీ దిగజార్చింది: కన్న ...
దేశ రాజకీయాల్లో విలువలను టీడీపీ దిగజార్చింది: కన్న ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.