(Local) Tue, 21 Sep, 2021

కశ్మీర్‌లో ఏం జరుగుతోంది?..మీకు మా మద్దతు ఉంటుంది-శశిథరూర్‌

August 05, 2019,   11:36 AM IST
Share on:
కశ్మీర్‌లో ఏం జరుగుతోంది?..మీకు మా మద్దతు  ఉంటుంది ...

జమ్ముకశ్మీర్‌లో మాజీ సీఎం  మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాను గృహనిర్బంధంలో ఉంచడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ స్పందించారు. ‘దేశంలో ప్రతి పౌరుడు మీకు మద్దతుగా నిలుస్తారు’ అంటూ సంఘీభావం ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న క్రమంలో క్రియాశీలక రాజకీయ నేతలు ప్రజల మధ్య ఉండాల్సిన అవసరముందన్నారు. కశ్మీర్‌లో ఏం జరుగుతోంది? ఏ తప్పుచేయకుండానే నేతల్ని రాత్రికి రాత్రి ఎందుకు నిర్బంధిస్తున్నారు. కశ్మీర్‌ ప్రజలు భారత పౌరులైనప్పుడు.. వారి నేతలు మన భాగస్వాములే కదా?. ఉగ్రవాదులు, వేర్పాటువాదులపై పోరాడుతున్న తరుణంలో నేతలందరూ క్రియాశీలకంగా ఉండాల్సిందే. ఇక వారినే త్యజిస్తే ఎవరు మిగులుతారు? అని కేంద్ర ప్రభుత్వాన్ని ట్విటర్‌ ద్వారా థరూర్ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన ము ...
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన ము ...
గృహ నిర్బంధంలో కశ్మీర్‌ మాజీ సిఎంలు
గృహ నిర్బంధంలో కశ్మీర్‌ మాజీ సిఎంలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.