(Local) Sat, 15 May, 2021

ఈడీ నోటీసులపై స్పందించిన షబ్బీర్ అలీ

August 03, 2019,   3:08 PM IST
Share on:
ఈడీ నోటీసులపై స్పందించిన షబ్బీర్ అలీ

తన పై ఈడీ కేసు నమోదైదంటూ వచ్చిన వార్తల పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. ఈడీ తనకు ఎటువంటి నోటిసులు అందలేదని చెప్పారు. దీని పై ఆయనమాట్లాడుతూ.… “ఈడీ అధికారుల నుంచి నాకు ఎటువంటి నోటిసులు రాలేదు. ఎప్పుడు నోటిసులు వచ్చినా నేను విచారణకు సహకరిస్తాను. ఖురేషి నా ఫ్యామిలీ ఫ్రెండ్. సానా సతీష్ కు నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నది వాస్తవమే. వజ్రాల వ్యాపారి సుఖేష్ గుప్త బెయిల్ కోసం రూ. కోటి 70 లక్షలు ఇచ్చాననేది అవాస్తవం. విచారణకు హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్, ఢిల్లీకి రమ్మంటే ఢిల్లీకి వస్తాను. ఈడీ, సీబీఐ ఎక్కడకు పిలిచినా వచ్చి సహకరిస్తాను.” అని షబ్బీర్ అలీ అన్నారు.

సంబంధిత వర్గం
ఇందిరమ్మ జయంతి...నివాళులర్పిస్తున్న ప్రముఖులు
ఇందిరమ్మ జయంతి...నివాళులర్పిస్తున్న ప్రముఖులు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.