(Local) Sat, 24 Jul, 2021

162 మంది ఎమ్మెల్యేలతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పరేడ్

November 25, 2019,   11:34 PM IST
Share on:
162 మంది ఎమ్మెల్యేలతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ప ...

మహారాష్ట్రలో హైడ్రామా చోటు చేసుకుంది. ఏ క్షణం ఎలాంటి నిర్ణయాలు వస్తున్నాయో ఎవరికీ అర్థకాక హైడ్రామా చోటు చేసుకుంటుంది. హయత్ గ్రాండ్ హోటల్ దగ్గర శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ 162 మంది ఎమ్మెల్యేలతో బల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ హాజరై ప్రసంగించారు. కోర్టు తీర్పునకు ముందే శరద్ పవార్ రాజకీయ చక్రం తిప్పుతున్నారు. తమ కూటమికి ఉన్న ఎమ్మెల్యేల బలాన్ని నిరూపించుకున్నారు. లాంగ్ లీవ్ మహా వికాస్ అఘాడీ అంటూ ఎమ్మెల్యేలందరూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలందరూ కలిసే ఉండాలని, బీజేపీ నేతల ప్రలోభాలకు లొంగిపోవద్దని ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే సూచించారు.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.