(Local) Sat, 24 Jul, 2021

పరిశోధనలు చేయడమంటే నూడుల్స్‌ తయారుచేసినంత ఈజీ కాదు

November 07, 2019,   2:16 PM IST
Share on:
పరిశోధనలు చేయడమంటే నూడుల్స్‌ తయారుచేసినంత ఈజీ కాదు

ప్రధాని నరేంద్ర మోదీ కోల్‌కతాలో జరుగుతున్న భారత్‌-అంతర్జాతీయ విజ్ఞానోత్సవాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రాజెక్టు యువతలో చాలా ఉత్సుకతను రేకెత్తించిందని అన్నారు. విజయవంతమైన ప్రాజెక్టుగా మోడీ దాన్ని పేర్కొన్నారు. చంద్రయాన్‌-2 కోసం మన శాస్త్రవేత్తలు చాలా కష్టపడ్డారని, అయితే అంతా అనుకున్న ప్రకారం జరగకపోయినా అది విజయవంతమైన ప్రాజెక్టేనని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్‌ సాధించిన గొప్ప విజయాల్లో అది కూడా ఒకటని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని శాస్త్రీయ పరిశోధనలు చేయడమంటే నూడుల్స్‌ తయారుచేసినట్లో అప్పటికప్పుడు పిజ్ఞా కొనుక్కున్నట్లో కాదని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగం తోడు లేకుండా ఏ దేశమూ ప్రగతి పథంలో ముందుకెళ్లలేదని వ్యాఖ్యానించారు.

You have an error in your SQL syntax; check the manual that corresponds to your MySQL server version for the right syntax to use near 'IndiaInternationalScienceFestival|IISFbeginsinKolkata|IISFkolkata|NarendraModi|P' at line 6
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.