(Local) Sat, 27 Feb, 2021

త‌మిళ‌నాడులో భారీ వర్షాలు

October 30, 2019,   1:10 PM IST
Share on:
త‌మిళ‌నాడులో భారీ వర్షాలు

త‌మిళ‌నాడు రాష్ట్రంలో బుధవారం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆరు జిల్లాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. తిరున‌వెల్లీ, ట్యూటికోరిన్‌, తేని, విరుదాన‌గ‌ర్‌, వెల్లోర్‌, రామ‌నాథ్‌పురం, మధురై జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వర్షాల కారణంగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాల పక్కన నిల్చోవద్దని ప్రజలకు అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు స్పష్టం చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.