(Local) Sat, 10 Apr, 2021

వైసీపీ మహిళా ఎమ్మెల్యేకి ఎదురుదెబ్బ

November 21, 2019,   5:53 PM IST
Share on:
వైసీపీ మహిళా ఎమ్మెల్యేకి ఎదురుదెబ్బ

గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీకి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో తన వాయిస్ రికార్డును బయటపెట్టిందని హెచ్ఎం ధనలక్ష్మీ పై విద్యాశాఖాధికారులకు రజనీ ఫిర్యాదు  చేశారు. దీంతో విద్యాశాఖాధికారులు ధనలక్ష్మీని సస్పెన్షన్ చేశారు. దీంతో హెచ్ఎం తన సస్పెన్షన్ పై హైకోర్టుకు వెళ్లారు. దీని పై విచారించిన కోర్టు హెచ్ఎం ధనలక్ష్మీ సస్పెన్షన్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో ధనలక్ష్మీ త్వరలో విధుల్లో చేరనున్నారు. 

అసలు వివాదానికి కారణం ఇది…  

చిలకలూరిపేట శారదా హైస్కూల్ విద్యా కమిటీపై గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. నూతనంగా ఏర్పడిన విద్యా కమిటీపై తీవ్ర అసంతృప్తితో వైసీపీ నేతలు ఉన్నారు. దాంతో ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే రజనీ జోక్యం చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మికి ఫోన్ చేసి కమిటీని రద్దు చేయాలని ఎమ్మెల్యే రజనీ ఆదేశించారు. ఈ విషయాన్ని ప్రస్తుతం కొనసాగుతోన్న విద్యా కమిటీకి ధనలక్ష్మి తెలియజేశారు. అంతే కాకుండా, విద్యా కమిటీని రద్దు చేయాలనీ రజని తనతో మాట్లాడిన వాయిస్ రికార్డును కూడా కమిటీకి వినిపించారు. ఈ విషయం తెలుసుకున్న రజని ప్రధానోపాధ్యాయురాలుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆమెపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ధనలక్ష్మిని అధికారులు సస్పెన్షన్ చేశారు. దీంతో హెచ్ఎం ధనలక్ష్మీ హైకోర్టులో తన సస్పెన్షన్ పిటిషన్ వేశారు. విచారించిన హైకోర్టు సస్పెన్షన్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.