(Local) Mon, 12 Apr, 2021

మహా ఉత్కంఠ.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం

November 25, 2019,   2:45 PM IST
Share on:
మహా ఉత్కంఠ.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం

సుప్రీం కోర్టులో మహారాష్ట్ర రాజకీయం పై వేసిన పిటిషన్ల పై విచారించిన సుప్రీం ధర్మాసనం తీర్పును మంగళవారానికి రిజర్వ్ చేసింది. తక్షణమే బలపరీక్ష జరపాలని కాంగ్రెస్,ఎన్సీపీ,శివసేనలు డిమాండ్ చేశాయి. బీజేపీ మాత్రం సమయం కావాలని కోరింది. తమకు 160 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కాంగ్రెస్,శివసేన,ఎన్సీపి తరపు లాయర్ వాదించారు. తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బీజేపీ తరపున సొలిసిటర్ జనరల్ వాదించారు. 54 మంది ఎన్సీపీ నేతల సంతకాలతో కూడిన లేఖను కూడా బీజేపీ సుప్రీం కోర్టుకు అందించింది. బల నిరూపణ అసెంబ్లీలో జరగడం ద్వారా తెలుస్తుందని గవర్నర్ ముందు తేలదని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం తీర్పును మంగళవారం ఉదయం 10.30 నిమిషాలకు రిజర్వ్ చేసింది. దీంతో మహా రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.