(Local) Sat, 15 May, 2021

ఉన్నావ్‌ కేసు మరో 2 వారాలు పొడిగింపు

August 19, 2019,   2:25 PM IST
Share on:
ఉన్నావ్‌ కేసు మరో 2 వారాలు పొడిగింపు

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి కారు ప్రమాదం పై విచారణ గడువును మరో 2 వారాలు పొడిగిస్తూ.. సుప్రీం కోర్టు ఆదేశించింది. విచారణ ను పూర్తి చేసేందుకు 4 వారాల గడువు కావాలని, బాధితురాలు, ఆమె తరపు న్యాయవాది వాంగ్మూలం ఇచ్చే స్థితిలో లేరని సుప్రీం కోర్టును సిబిఐ కోరింది. దీంతో 2 వారాల గడువు ఇచ్చిన కోర్టు.. బాధితురాలి తరపు న్యాయవాదికి వైద్య ఖర్చుల కోసం రూ.5 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని యుపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
అత్యాచార ఘటనతో పాటు రోడ్డు ప్రమాదం కేసుపై సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. బాధితురాలి వాంగ్మూలాన్ని ఇంకా నమోదు చేయలేదని అందువల్ల విచారణకు మరో నాలుగు వారాల సమయం కావాలని సీబీఐ కోర్టుకు వివరించింది.

సంబంధిత వర్గం
డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట
డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.