(Local) Sun, 20 Jun, 2021

4 రాష్ట్రాల సీఎస్‌లకు సమన్లు జారీ చేసిన సుప్రీం

November 07, 2019,   2:12 PM IST
Share on:
4 రాష్ట్రాల సీఎస్‌లకు సమన్లు జారీ చేసిన సుప్రీం

ఉత్తరాదిన నాలుగు రాష్ట్రాల్లో నానాటికి పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. తీవ్ర వాయుకాలుష్యానికి కారణం ప్రభుత్వాల వైఫల్యమేనని తీవ్రస్థాయిలో మండిపడింది. తక్షణం వచ్చి కాలుష్య నివారణ చర్యలను వ్యక్తిగతంగా వివరించండంటూ ఢిల్లీ, పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. అంతేకాక కాలుష్యంపై తానే స్వచ్ఛందంగా ఓ కేసును నమోదుచేసి బుధవారం విచారణ చేపట్టాలని నిర్ణయించింది. సీఎస్ లు కూడా బుధవారమే వచ్చి వివరణ ఇవ్వాలని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల ధర్మాసనం కోరింది. ఢిల్లీలో నివసించే ప్రజల జీవితకాలం తగ్గుతోందని సాంకేతిక సమాచారం చెబుతోందని, ఈ కారణంతో పెద్దఎత్తున వలసలు చోటు చేసుకోరాదని వ్యాఖ్యానించింది. దీని పై సమాధానం చెప్పాలంటూ ఢిల్లీ ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్‌ దేవ్‌కు సుప్రీం సమన్లు జారీ చేసింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.