(Local) Thu, 04 Jun, 2020

ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రత్యేక ప్యాకేజీ

August 17, 2019,   11:49 AM IST
Share on:
ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప ...

అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో ఎస్బీఐ శాఖల ద్వారా జీతాలు తీసుకునే వారందరికీ ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. ఈ ప్యాకేజీ కిందికి వచ్చిన వారి వేతన ఖాతాలను ‘స్టేట్‌ గవర్నమెంట్‌ శాలరీ ప్యాకేజీ’ (ఎస్‌జీఎస్‌పీ)గా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సేవింగ్‌ ఖాతాలను ఎస్బీఐ ప్రకటించిన స్టేట్‌ గవర్నమెంట్‌ శాలరీ ప్యాకేజీగా (ఎస్‌జీఎస్‌పీ) మార్చుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇతర ఖాతాదారులతో పోలిస్తే కొన్ని మెరుగైన సేవలు, రాయితీలు, ప్రయోజనాలు పొందవచ్చని ఎస్బీఐ అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని లక్షాలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ నూతనంగా ప్రకటించిన  ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. అయితే ఈ ప్యాకేజీపై అవగాహన లేకపోవడంతో చాలామంది ఉద్యోగులు ఇంకా ఎస్జీఎస్పీ ప్యాకేజీలోకి వారి ఖాతాలను మార్చుకోలేదని తెలుస్తోంది. దీనిపై ఉద్యోగులలో అవగాహన కల్పించేందుకు ఎస్బీఐ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నారు. జీతం ఆధారంగా ఖాతాలకు పేర్లు ఈ విధంగా ఎస్బిఐ ప్రకటించింది జీతం పరిధి 5-20 వేలు ఉంటె సిల్వర్  ఖాతా, రూ.20 - 50 వేలు ఉంటె గోల్డ్‌ ఖాతా, రూ.50 వేలు - లక్ష ఉంటె డైమండ్‌ ఖాతా, రూ.లక్ష పైబడినవి ఉంటె ప్లాటినం ఖాతాగా నిర్ణయించింది.  అలాగే ఖాతాలో బ్యాలెన్స్ లేకున్నా డబ్బులు తీసుకునే సువర్ణ అవకాశాన్ని కూడా ఎస్బిఐ ప్రభుత్వ ఉద్యోగులకు కలిపిస్తుంది. ఉద్యోగులు తమ ఖాతాలను ఎస్జీఎస్పీలోకి మార్చుకోవడానికి దరఖాస్తుతో పాటు ఉద్యోగి ఐడీ కార్డు, పాన్‌కార్డు, ఇటీవలి శాలరీ స్లిప్పు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలపై సంతకం చేసి బ్యాంకులో అందజేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా వీరికి ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం ఉంటుంది. ఖాతాలో నగదు లేకపోయినా రెండు నెలల వేతనంతో సమానమైన మొత్తం వరకూ తీసుకోవచ్చు. నిర్ణయించిన గడువులోగా దీనిని తిరిగి చెల్లించాల్సి వుంటుంది. అయితే ఎంపికచేసిన ఖాతాదారులకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుందని ఎస్బీఐ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు మీ సమీపంలో ఉన్న ఎస్‌బీఐ కార్యలయాన్నీ సంప్రదించి మరిన్నీ వివరాలు తెలుసుకొండి. 

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.