(Local) Sun, 20 Jun, 2021

అసెంబ్లీ ప్రాంగణంలో ఎస్బీఐ బ్రాంచ్ ప్రారంభం

November 09, 2019,   10:58 AM IST
Share on:
అసెంబ్లీ ప్రాంగణంలో ఎస్బీఐ బ్రాంచ్ ప్రారంభం

తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో నూతనంగా నవీకరించిన భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) శాఖను రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడారు. ఆయన  మాట్లాడతూ … “శాసనసభ్యులు తమ నగదు లావాదేవీలు నిర్వహించుకోవడానికి అసెంబ్లీ ప్రాంగణంలోని ఈ బ్రాంచీ వీలుగా ఉంటుంది. శాఖను నవీకరించడంతో పాటు విస్తరించడంతో మరింతగా మెరుగైన సేవలను అందించవచ్చు. నా బ్యాంక్ అకౌంట్ కూడా ఈ శాఖలోనే ఉన్నది. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఇక్కడి సిబ్బంది తమ కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందిస్తున్నారు. వారికి నా అభినందనలు.” అని అన్నారు. 

ఈ సందర్భంగా హుజూర్ నగర్ శాసనసభ స్థానం నుండి నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డికి నూతన ఖాతా పుస్తకాన్ని స్పీకర్ పోచారం మరియు ముఖ్య అతిధులు అందించారు. ఈ కార్యక్రమంలో  శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్ రావు, శాసనసభ్యులు, శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహా చార్యులు, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.