(Local) Sun, 16 Feb, 2020

జమ్మూ కాశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

November 27, 2019,   11:02 AM IST
Share on:
జమ్మూ కాశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంత్ నాగ్ లో గ్రనేడ్ విసరడంతో ఇద్దరు చనిపోయారు. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. దక్షిణ కాశ్మీర్ అనంత్ నాగ్ లోని వగూరా ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు శ్రీనగర్ లో కూడా ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి జరిపారు. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.